'వక్కపట్లవారిపాలెం అభివృద్ధికి సంపూర్ణ సహకారం'

'వక్కపట్లవారిపాలెం అభివృద్ధికి సంపూర్ణ సహకారం'

కృష్ణా: నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం రూ.32 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి ఏడు సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చిన అంబటి వెంకటలక్ష్మిని ఎమ్మెల్యే అభినందించారు.