ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
SKLM: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం సరుబుజ్జిలి మండలంలో జరిగింది. అవతరాబాద్‌కి చెందిన S.రామానాయుడు(77) రొట్టవలస సమీపంలో ఉన్న టిఫిన్ కొట్టు నుంచి కాలి నడకన ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బత్తిలి వైపు వెళుతున్న బస్సు వెనక నుంచి ఆ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.