'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పై అవగాహన కల్పించాలి'

GNTR: విద్యాసంస్థలు, గృహ సముదాయాలు, పబ్లిక్ ప్రదేశాల్లో పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రజలకు టీడీపీ నేతలు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే నసీర్ సూచించారు. గుంటూరులోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రపై అవగాహన కల్పించాలని వారికి సూచించారు.