ప్రజల భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమాలు

ప్రజల భద్రతపై పోలీసుల  అవగాహన కార్యక్రమాలు

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు పోలీసులు శనివారం గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సైబర్ మోసాలు, 'డిజిటల్ అరెస్ట్' కాల్స్, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, 18 ఏళ్లు నిండని యువకుల వాహన నడపటం వంటి అంశాలపై ప్రజలకు సూచనలు అందించారు. మహిళల భద్రత, చైన్ స్నాచింగ్ నివారణ, బాల్య వివాహాల చట్టపరమైన నిషేధంపై కూడా అవగాహన కల్పించారు.