RTCలో మెకానిక్ ఉద్యోగాలు
ప్రకాశం: కనిగిరి RTCలోని గ్యారేజీ నందు పనిచేయుటకు కాంట్రాక్ట్ పద్ధతిపై 10 మంది మెకానిక్‌లను తీసుకుంటున్నట్లు కనిగిరి డిపో మేనేజర్ మహమ్మద్ సయనా బేగం తెలిపారు. మంగళవారం మాట్లాడుతూ.. అర్హత గల మెకానిక్‌లకు నేలకు గౌరవవేతనం క్రింద రూ. 17960 చెల్లించడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని మెకానికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.