కరాటే ఛాంపియన్ షిప్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
JGL: కరాటే అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7న నిర్వహించనున్న సెకండ్ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్-2025 పోస్టర్‌ను బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను వెలికితీయాలన్నారు. జగిత్యాల కరాటే ఛైర్మన్ లింగయ్య, ఆర్గనైజర్ ఆరుముల్ల పవన్, కో ఆర్గనైజర్ గంగాధర్, ఆకాశ్, మహోదయ్, రాకేశ్ పాల్గొన్నారు.