సంతెకూడ్లూరులో అంబేద్కర్ వర్ధంతి
KRNL: సంతెకూడ్లూర్ కేవీపీఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 69వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి బీ.తిక్కప్ప, మండల ఉపాధ్యక్షుడు జీ.పరమేష్, గ్రామ అధ్యక్షడు రాము, కార్యదర్శి శివప్ప తదితరులు పాల్గొన్నారు.