VIDEO: పరవళ్లు తొక్కుతున్న కైగల్ వాటర్ ఫాల్.!

VIDEO: పరవళ్లు తొక్కుతున్న కైగల్ వాటర్ ఫాల్.!

CTR: శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు బైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ జలపాతం పొంగిపొర్లుతోంది. గత కొన్ని నెలలుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నా కైగల్ వాటర్ ఫాల్‌కు మాత్రం నీరు చేరలేదు. ఈ మేరకు ప్రకృతి మధ్యలో ఉన్న ఈ జలపాతం ఒకప్పుడు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉండేది. ప్రస్తుతం పోలీసుల ఆంక్షలు, కొన్ని ప్రమాదాల నేపథ్యంలో పర్యాటకుల రాక పూర్తిగా తగ్గిపోయింది.