మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిత్యాన్నదానం

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రంలో మాజీ జిల్లా జడ్పీ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు ఈరోజు అన్నదానం వితరణ చేశారు. ప్రతినిత్యం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికుల కోసం అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. పేదవారికి అన్నదానం చేయడంలో ఆనందం ఉందని వారు తెలిపారు.