'రోడ్లు, ఫుట్ పాత్‌ల ఆక్రమణలు తొలగించాలి'

'రోడ్లు, ఫుట్ పాత్‌ల  ఆక్రమణలు తొలగించాలి'

VSP: విశాఖలో పలు రోడ్లు, కాలువలు, ఫుట్‌పాత్‌ల‌ను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆక్రమణలను తొలగించాలని అధికారులను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. గురువారం ఆయన 2వ జోన్, 12వ వార్డు పరిధిలో గల ఆరిలోవ, పెదగదిలి సమీపంలో ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. పెదగదిలి సమీపంలో ఫుట్పాత్‌ను ఆక్రమించిన హోటల్ సూర్య క్యాంటీన్‌కు ఫైన్ వేశారు.