బాలిక కిడ్నాప్ కేసులో నిందితులకు రిమాండ్

బాలిక కిడ్నాప్ కేసులో నిందితులకు రిమాండ్

ప్రకాశం: రాచర్ల మండలంలోని అనుములవీడులో ఈనెల 12వ తేదీన 4వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం అదుపులో తీసుకున్నారు. నగదు లావాదేవీల విషయంలో బాధితుల నుంచి నగదు వసూలు చేయాలనే ఉద్దేశ్యంతో నిందితులు బాలికను కిడ్నాప్ చేసినట్లు డీఎస్పీ నాగరాజు మీడియా సమావేశంలో తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించామని అన్నారు.