'కోసిన పంటలను సంరక్షించుకోవాలి'
ప్రకాశం: త్రిపురాంతకం మండలంలో వరి కోతలు కోసిన రైతులు పంటలను సంరక్షించుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇప్పటికే దిత్వ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అలర్టై, గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కోసిన పంటలను ఎత్తైన ప్రాంతాల్లో ఉండేలా చూసుకోవాలి, అలాగే టార్పలిన్ కప్పి వర్షపు నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలన్నారు.