సామాన్యుడు వలె క్యూలైన్లో స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

సామాన్యుడు వలె క్యూలైన్లో స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: కార్తీక మాసం శుద్ధ ఏకాదశి సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి, ఒక సామాన్యుడివలె క్యూలైన్లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాట్లను గురించి పోలీసులతో మాట్లాడి తెలుసుకున్నారు.