కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య వివాదం
ఉమ్మడి కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల విలీనంపై MLAలు, మంత్రి మధ్య వివాదం రాజుకుంది. గన్నవరం నియోజకవర్గాన్ని NTR జిల్లాలో కలపాలని MLA యార్లగడ్డ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పెనమలూరును కూడా విలీనం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రెండు మండలాలు జిల్లా నుంచి తీసేస్తే మచిలీపట్నం చిన్నదవుతుందని మంత్రి కొల్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో నేతల తీరుపై CM అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.