పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదు: పౌరసరఫరాల శాఖ
BDK: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌కు కొరత లేదని పౌరసరఫరాల శాఖ ఇవాళ పేర్కొంది. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని తెలిపింది. రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోందని, ప్రజావసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. వదంతుల వల్లే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లు పెరిగినట్లు చెప్పింది.