కొండబిట్రగుంటలో అభివృద్ధి పనులకు శ్రీకారం
NLR: బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇవాళ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేసి పలు శంకుస్థాపనలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.