వికాసిత్ భారత్‌లో భాగస్వాములుకావాలి : ఎంపీ
MBNR: ప్రధాని మోదీ వికాసిత్ భారత్‌లో యువ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ నెట్వర్క్ వెబ్‌సైట్‌ను ఆమె లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. దేశ ప్రగతిలో యువ పారిశ్రామికవేతలు భాగస్వామ్యం కావాలని ఆమె సూచించారు. మోదీ లాంటి ఒక విజనరీ లీడర్ ప్రధానిగా ఉండడం మనందరి అదృష్టం అని డీకే అరుణ ప్రశంసించారు.