పటేల్ సేవలు చిరస్మరణీయం: ఎస్సై
GDWL:సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గట్టులో ఎస్సై మల్లేష్ ఆధ్వర్యంలో స్థానిక యూత్, విద్యార్థులచే శుక్రవారం 2కే రన్ నిర్వహించారు. పటేల్ వంటి మహనీయుల వేడుకలను ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాలని ఆయన కోరారు. కులమతాలకు అతీతంగా దేశంలో అందరూ కలిసిమెలిసి జీవించాలని చెప్పిన గొప్ప వ్యక్తి పటేల్ అని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్ఐ కొనియాడారు.