శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని 78,974 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 28,995 మంది భక్తులు తలనీలాలు సమర్పించి,మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామి వారికి 3.61 కోట్లు హుండీ ఆదాయం చేకూరినట్లు అధికారులు తెలిపారు.