మోదీ అధ్యక్షతన కొనసాగుతున్న కేంద్ర కేబినెట్
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా చమురు కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్న వేళ ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే సా. 5 గంటలకు అన్ని పార్టీలతో ప్రధాని భేటీ కానున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, చమురు, LPG కొరత వంటి అంశాలపై అన్ని పార్టీల నాయకులతో మోదీ చర్చించనున్నారు. ఈ మీటింగ్ తర్వాత మోదీ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.