'విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'
CTR: చిత్తూరు క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఉమామహేశ్వర రావు సావిత్రమ్మ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, 'ధైర్య స్పర్శ' కార్యక్రమం, మహిళలపై జరిగే నేరాలు, సైబర్ భద్రత వంటి అంశాలపై వివరించారు. అలాగే విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆన్‌లైన్‌లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.