చెక్ బౌన్స్ కేసులో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

చెక్ బౌన్స్ కేసులో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

కృష్ణా: చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. సోమవారం ఉయ్యూరు జూనియర్ సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. 2018లో గండిగుంటకు చెందిన వెంకటరావు వద్ద రూ.4లక్షలు విజయవాడకు చెందిన శ్రీనివాసరావు అప్పుగా తీసుకుని చెల్లించే క్రమంలో రూ.4 లక్షల చెక్కు వెంకట్రావుకు అందించారు. చెక్ బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించగా రూ.5.90లక్షల ఫైన్ ఏడాది జైలు శిక్ష విధించింది.