VIDEO: గొర్రె పిల్లలకు రోగాలు.. ఆందోళనలో కాపరులు

VIDEO: గొర్రె పిల్లలకు రోగాలు.. ఆందోళనలో కాపరులు

SRPT: మోతే మండలం రాఘవాపురంలో గొర్రె పిల్లలు అకస్మాత్తుగా వ్యాధుల బారిన పడుతున్నాయి. ఇప్పటికే పలు జీవాలు మృతి చెందడంతో కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కళ్లెదుటే మూగజీవాలు ప్రాణాలు విడుస్తుండటంతో, మేకల కాపరులే స్వయంగా ఇంజెక్షన్లు వేస్తూ వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించాలని కాపరులు కోరుతున్నారు.