యువకుడు అదృశ్యం.. కేసు నమోదు

యువకుడు అదృశ్యం.. కేసు నమోదు

MBNR: నవాబుపేట మండలంలోని కొల్లూరు గ్రామంలో జక్కని అంజయ్య (33) అనే యువకుడు ఈ నెల 8వ తేదీన అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు మరణించడంతో, వివాహితులైన ఎనిమిది మంది సోదరీమణులు అత్తగారిళ్లలో ఉండటంతో అంజయ్య ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. అతని ఆచూకీ కోసం సోదరీమణులు బంధుమిత్రుల వద్ద వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో శుక్రవారం అంజయ్య ఆరో సోదరి రాపోలు చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.