VIDEO: ఈనెల 12న వైసీపీ ప్రజా ఉద్యమం పేరిట నిరసన
కోనసీమ: ఈ నెల 12 వ తేదీన పి.గన్నవరం లో 'ప్రజా ఉద్యమం' పేరిట నిరసన చేపడుతున్నట్లు వైసీపీ పి.గన్నవరం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద ఆయన 'ప్రజా ఉద్యమం' కార్యక్రమం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.