'సింగపూర్' పేరుకు సంస్కృత మూలం
'సింగపూర్' అనే పేరు సంస్కృతం నుంచి ఉద్భవించిందని ఆ దేశ మాజీ ఉప ప్రధాని తియో చీ హియన్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన అటల్ బిహారీ వాజ్‌పేయీ మెమోరియల్ లెక్చర్‌లో ఆయన మాట్లాడుతూ.. 1867 వరకు సింగపూర్ పరిపాలన కోల్‌కతా నుంచి జరిగిందని గుర్తు చేశారు. సింగపూర్ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో భారతీయులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.