VIDEO: నడిరోడ్డుపై తాగుబోతు వీరంగం

TPT: శ్రీకాళహస్తి భేరి వారి మండపంలో నడిరోడ్డుపైన తాగుబోతు వీరంగం సృష్టించాడు. బస్సు కింద పడుకుని హల్చల్ చేశాడు. స్థానిక ప్రజలు, కండక్టరు వారించినా వినలేదు. బస్సు టైర్ల కింద పడుకోవడానికి ప్రయత్నించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు తాగుబోతును అక్కడి నుండి తీసుకెళ్లారు.