తిరుపతి గంగమ్మ జాతరకు పటిష్ఠ బందోబస్త్: SP

TPT: తిరుపతి గంగమ్మ జాతరకు పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. జాతర ఏర్పాట్లపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్న ఆయన, పోలీసు సిబ్బంది ఎక్కడా అజాగ్రత్తగా ఉండకూడదని హెచ్చరించారు. జాతర చివరి రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.