జూలై 3 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

జూలై 3 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

అమర్‌నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభమవుతుందని J&K గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రకటించారు. 57 రోజులపాటు సాగే ఈ యాత్ర.. ఆగస్టు 28న ముగుస్తుంది. భక్తులు ఏప్రిల్‌ 15 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న 554 శాఖల్లో దరఖాస్తుదారులు ముందస్తు నమోదులు చేసుకోవచ్చు. అయితే, 13 ఏళ్లలోపు పిల్లలను, 70 ఏళ్లకు పైబడిన వృద్ధులను ఈ యాత్రకు అనుమతించరు.