మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్
కర్నూలు: జిల్లాలో 20 వేల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్నను తక్షణమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, క్వింటాలుకు రూ. 2,450 మద్దతు ధర ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ కోరారు. అధిక వర్షాల కారణంగా ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నా, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మధ్య దళారీలకు రైతులు బారిన పడుతున్నారని అన్నారు.