VIDEO: రైస్ మిల్లులో 70 బస్తాల కోత.. రైతుల ఆగ్రహం
KMR: బీర్కూర్ మండలంలో శ్రీసిద్ధి వినాయక రైస్ మిల్లులో రైతుల ధాన్యం లోడులో పెద్ద ఎత్తున కోత విధించారు. నర్సింగ్‌రావుపల్లి రైతులు పంపిన 615 బస్తాల సన్న రకం వరి ధాన్యంలో, రైతుల అనుమతి లేకుండా ఏకంగా 70 బస్తాల తరుగు తీస్తామని మిల్లు యాజమాన్యం ప్రకటించింది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇది శ్రమ దోపిడీగా పేర్కొంటూ, న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు.