సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

KMM: ఖమ్మం నగరంలోని 35వ డివిజన్ మోతి నగర్‌లో రూ. 50.25 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఖమ్మం నగర అభివృద్ధి తమ అంతిమ లక్ష్యమని తెలిపారు. నగరంలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఉన్నారు.