తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి కృష్ణతేజ అతిథిగృహం వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 86,364 మంది భక్తులు దర్శించుకోగా.. 30,172 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, స్వామివారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.