పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి

NRPT: నర్వ మండలం నాగిరెడ్డిపల్లి శివారులో అక్రమంగా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,22,900 నగదు, 9 బైకులు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.