ప్రశాంతంగా ముగిసిన జీవశాస్త్రం పరీక్ష

ప్రశాంతంగా ముగిసిన జీవశాస్త్రం పరీక్ష

నల్గొండ జిల్లాలో టెన్త్ జీవశాస్త్రం పరీక్ష ఇవాళ ప్రశాంతంగా ముగిసినట్లు డీఈవో బిక్షపతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 106 కేంద్రాల్లో 19,698 మంది రెగ్యులర్ విద్యార్థులకు గానూ 19,663 మంది (99.82%) హాజరయ్యారు. 103 మంది ప్రైవేట్ విద్యార్థులకు 97 మంది (94.17%) హాజరయ్యారు. మొత్తం 41 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.