ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన ర్యాలీ

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన ర్యాలీ

MDK: తూప్రాన్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజిని రాఘవేందర్ గౌడ్ అన్నారు. పట్టణ అభివృద్ది చేసుకునేందుకే ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి, వైస్ చైర్ పర్సన్ కొక్కొండ సమత కాశిరెడ్డి తదితరులు ర్యాలీ నిర్వహించారు.