గచ్చిబౌలి-లింగంపల్లి వాహనదారులకు అలర్ట్
RR: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. రేపటి నుంచి ఒక సంవత్సరం పాటు ఈ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు జంక్షన్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, పనులకు సహకరించాలని కోరారు.