'ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కృషి చేయాలి'

'ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కృషి చేయాలి'

SRPT: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం తుంగతుర్తి మండలం తూర్పుగూడెంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్నం భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందుతాయన్నారు.