ఫర్నిచర్ రంగంలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
KMR: స్కిల్ ఇండియాలో భాగంగా హైదరాబాద్‌లోని FFSC సెంటర్ ద్వారా ఫర్నిచర్ రంగంలో శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు కామారెడ్డి అదనపు కలెక్టర్ మధుమోహన్ తెలిపారు. 10వ తరగతి అర్హత, 16-50 ఏళ్ల వయస్సు గల వారు అర్హులు. 3 నెలల శిక్షణ, అనంతరం 6 నెలల అప్రెంటీస్‌షిప్ ఉంటుంది. ఆసక్తిగల జిల్లా యువత 76739 76699 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.