VIDEO: కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. 12మంది మృతి
శ్రీకాకుళంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. రెయిలింగ్ ఊడిపోవడంతో 12 మంది మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఆలయంలో ఎంటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.