బెంగాల్‌లో ఎన్నికల సంఘం పర్యటన
ఇవాళ పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికల నిర్వహణపై ప్రణాళికను వెల్లడిస్తారు. కాగా, నిన్ననే TMC, BJP, CPM, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీల ప్రతినిధులతో EC అధికారులు సమావేశమయ్యారు.