నిండుకుండలా పాలేరు.. మూడు గేట్లు ఎత్తివేత

నిండుకుండలా పాలేరు.. మూడు గేట్లు ఎత్తివేత

KMM: పాలేరు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని నిండుకుండలా దర్శనమిస్తోంది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు, నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల కారణంగా జలాశయం నిండింది. రిజర్వాయర్ నిండటంతో అధికారులు సాగు, తాగునీటి అవసరాలకు మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.