కీసరలో సారొచ్చాడని షాపులు బంద్

మేడ్చల్: పోలీస్ వస్తుండంటే దొంగ పారిపోయినట్లు ఉంది ఈ కథ. కీసరలో బుధవారం ఒకేసారి మెడికల్ షాపులు మూతబడ్డాయి. స్ట్రైక్ ఏమైనా చేస్తున్నారా? అని ఆరా తీయగా అసలు విషయం తెలిసి జనం నివ్వెరపోయారు. మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు చేస్తున్నాడని షాపులు మూసేయడం గమనార్హం. కీసరలో నిబంధనలు పాటిస్తోన్న షాపులు లేవా? అనే చర్చ మొదలైంది.