కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం

కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం

VZM: గజపతినగరంలోని సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకొని ఆదివారం సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సుధాకర్ పర్యవేక్షణలో పురోహితులు మధు వేదమంత్రాల నడుమ కళ్యాణం జరిపించారు. అలాగే శ్రీరామ క్షేత్రంలో గల సీతారామస్వామి ఆలయంలో కళ్యాణం జరిగింది. అనంతరం వేలాది మందికి అన్న ప్రసాద వితరణ గావించారు.