ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేటి పర్యటన వివరాలు
MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో సోమవారం అనిరుధ్ రెడ్డి పర్యటించనున్నారని వ్యక్తిగత సహాయకులు బాలు ఓ ప్రకటనలలో తెలిపారు. ఉదయం 10 గంటలకు నవాబుపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని, రుద్రారంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారన్నారు. అనంతరం మిడ్జిల్‌లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.