'వైద్య సేవలు ఉపయోగించుకోవాలి'
KDP: గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్య సేవలు ఉపయోగించుకోవాలని మండల వైద్యాధికారి మహమ్మద్ తాహా కోరారు. 8వ జాతీయ పోషణ మాస ఉత్సవాల సందర్భంగా గురువారం తంగేడు పల్లె ఆరోగ్య ఉప కేంద్రంలో మహిళలు, బాలింతలు, చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 1వ తేదీ వరకు ప్రతిరోజు ఒక విలేజ్ క్లినిక్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.