'పంచాయతీ సెక్రెటరీకి నోటీసులు జారీ'
JGL: ఎండపల్లి గ్రామ పంచాయతీ సెక్రెటరీ ప్రభాకర్‌కు కలెక్టర్ బీ. సత్యప్రసాద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను అధికారులు, సిబ్బంది నిబంధనల ప్రకారం బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.