'అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం'
SRCL: అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు అది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములవాడ రూరల్ మండల పరిధిలోని 54 మంది లబ్ధిదారులకు రూ. 17 లక్షల 85 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు.