అర్ధరాత్రి ఏటీఎం మాయం

అర్ధరాత్రి ఏటీఎం మాయం

KMR: బిచ్కుంద మండల కేంద్రంలోని SBI బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రాత్రి రెండు, మూడు గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఏటీఎంలో దొంగలు తమ పని మొదలుపెట్టగానే అలారం మొగిందని, వెనువెంటనే బ్యాంకు మేనేజర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించినా.. పోలీసులు రావడానికి ఆలస్యం చేయడంతో దొంగల పని సులభమయ్యింది.