'రో-కో' లేకుండా 18 ఏళ్లలో ఇదే తొలిసారి

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, వారిద్దరూ లేకుండానే టీమిండియా త్వరలో జరగబోయే ఆసియా కప్‌లో ఆడనుంది. గత 18 సంవత్సరాలలో రోహిత్, కోహ్లీ ఇద్దరూ లేకుండా టీమిండియా ఆసియా కప్ వంటి ఒక పెద్ద మల్టీ-నేషన్ టోర్నమెంట్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే, యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.